ఎంపీగా కొనసాగుతా: అఖిలేష్‌ యాదవ్‌

Published on

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్.. తాను ఎంపీగానే కొనసాగుతానని ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన సమాజ్‌వాది పార్టీ ఎంపీలతో ఇవాళ అఖిలేష్‌ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగానే కొనసాగుతానని, త్వరలో ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని స్పష్టంచేశారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ కన్నౌజ్‌ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. అంతకుముందు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కర్హాల్‌ అసెంబ్లీ స్థానంలో గెలిచి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. కన్నౌజ్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కర్హాల్‌ ఒకటి.

అయితే లోక్‌సభ సభ్యుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్న అఖిలేష్‌ యాదవ్‌ను త్వరలో సమాజ్‌వాది పార్టీ లోక్‌సభాపక్ష నేతగా ఎన్నుకుంటామని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ అంతా ఢిల్లీలో జరుగుతుందని చెప్పారు. కాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ 37 స్థానాల్లో విజయం సాధించింది. దాంతో లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీగా ఎస్పీ అవతరించింది. 240 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా, 99 స్థానాలతో కాంగ్రెస్‌ రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నాయి.

Search

Latest Updates