కవితతో ప్రవీణ్‌ కుమార్, బాల్క సుమన్ ములాఖత్‌

Published on

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమాన్ ములాఖత్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులు తీహార్ జైలుకు చేరుకుని అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకొని తన ప్రత్యర్థులను భయపెడుతోందని వివర్శించారు. ఆమెను అరెస్ట్ చేయడం ద్వారా రాజ్యంగ విలువలను, చట్టాలను అపహాస్యం చేసిందన్నారు. ఒకవైపు అరవింద్ కేజ్రివాల్‌కు బెయిలు మంజూరు చేసిన కోర్టు కవిత విషయంలో ఎందుకు చేయలేదని ప్రశింంచారు. కేంద్ర సంస్థలన్నీ బీజేపీ చేతిలో పనిముట్లుగా మారిపోయాయన్నారు.

అయితే లిక్కర్ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నిన్న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో.. సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. కవిత బెయిల్ పిటిషన్‌‌ విచారణను మే 24కు వాయిదా చేసింది. దీంతో మరోసారి కవితకు బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది.

Search

Latest Updates