జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్ పై( రెండు వాహనాలు) టెర్రరిస్టులు ఒక్కసారిగా ఫైర్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన వాహనంతో పాటు మరో వాహనంపైనా దాడి చేశారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా.. నలుగురు సైనికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఉధంపూర్లోని కమాండ్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఉగ్రవాదులను గర్తించేందుకు భారీ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు.
దాడి తర్వాత, బలగాలు ఉగ్రవాదులను గుర్తించేందుకు చుట్టుపక్కల పెట్రోలింగ్, వాహనాల తనిఖీలను ముమ్మరం చేశాయి. పూంచ్ సెక్టార్ లోని షా సితార్ ప్రాంతం చుట్టూ భద్రతా దళాలు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఈ ప్రాంతంలో సెర్చ్, కార్డన్ ఆపరేషన్ చేస్తున్నారు.
దాడి జరిగిన పూంచ్ ప్రాంతం అనంత్‌నాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది. మే 25న ఆరో దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడంతో భద్రతా దళాలు ముమ్మర తనిఖీని చేస్తున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి.