ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..ఎనిమిది మంది మావోయిస్టులు మృతి

Published on

నారాయణపూర్ జిల్లాలోని కుతుల్, ఫరస్ బేడ, కొడతమెట్ట అటవీ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అదే విధంగా ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందగా.. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు.

అబుల్ మడ్ ప్రాంతంలో గత రెండు రోజుల నుంచి ఎన్ కౌంటర్ జరుగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. అంతర్ జిల్లాల యాంటీ నక్సల్ దళాలు కుంబింగ్ నిర్వహిస్తుండగా.. ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, కాంకేర్‌లోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, 53వ బెటాలియన్‌కు చెందిన బలగాలు పాల్గొన్నాయన్నారు.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోందని, మావోయిస్టులు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నామని తెలిపారు.

Search

Latest Updates