ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్… ఏడుగురు నక్సల్స్ మృతి

Published on

ఛత్తీస్ గడ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గత రెండు నెలల వ్యవధిలో ఛత్తీస్ గఢ్ లో జరిగిన మూడో ఎన్ కౌంటర్ ఇది. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందగా, 12 మందికి పైగా మావోయిస్టులు గాయపడినట్టు తెలుస్తోంది. చనిపోయిన నక్సల్స్ ఇంద్రావతి దళానికి చెందిన వారిగా సమాచారం.

దండకారణ్యంలో మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో 23వ తేదీ గురువారం ఐటీబీపీ, ఎస్‌టీఎఫ్, డీఆర్జీ,బస్తర్ బెటాలియన్‌కు చెందిన సుమారు వెయ్యి మంది బలగాలు…నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లో భాగంగా కూంబింగ్ చేపట్టారు. దంతేవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా, మావోలు ఎదురుపడి కాల్పులు జరిపినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు . భద్రతా బలగాలు కూడా దీటుగా స్పందించి ఎదురు కాల్పులతో జరపడంతో ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ 7గురు మరణించినట్లలు , మరికొంతమంది నక్సల్స్ పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Search

Latest Updates