దళిత యువకుడి దారుణ హత్య… వీడియో వైరల్

Published on

రాజస్థాన్‌లోని ఝుంజునులో దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తాడుతో కట్టేసి దారుణంగా కొట్టి చంపిన షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో ఆలస్యంగా బయటపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సంజయ్ సింగ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వీడియోను షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.

మే 14న జుంజునులోని సూరజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలోడా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బలోడా గ్రామానికి చెందిన దళిత యువకుడు రామేశ్వర్ వాల్మీకిని మద్యం మాఫియాకు చెందిన కొందరు కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి చంపిన కేసులో రెండు వీడియోలు ఇప్పుడు బయటపడ్డాయి.

ఇద్దరు యువకులు రామేశ్వర్ వాల్మీని ఒక భవనంలోకి తీసుకెళ్లి అతని చేతులు, కాళ్లు పట్టుకోగా, ఓ యువకుడు కర్రతో తీవ్రంగా కొట్టడటం ఆ వీడియోలు కనిపిస్తోంది..అతన్ని దారుణంగా కొట్టిన కారణంగా యువకుడు మరణించినట్లు తెలుస్తోంది.

అయితే హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిందితులను దీపేంద్ర అలియాస్ చింటూ రాజ్‌పుత్, ప్రవీణ్ అలియాస్ పీకే మేఘవాల్, ప్రవీణ్ అలియాస్ బాబా మేఘవాల్, సుభాష్ అలియాస్ చింటూ మేఘవాల్, సతీష్ అలియాస్ సుఖ మేఘవాల్‌లుగా గుర్తించారు. నిందితులు గతంలోనూ ఇతర నేరాలకు పాల్పడినట్లు సమాచారం. సూరజ్‌గఢ్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Search

Latest Updates