నేమ్‌ ప్లేట్స్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు.. మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ

Published on

కన్వరీ యాత్రా మార్గంలోని స్టాల్స్‌, హోటల్స్‌ నేమ్‌ ప్లేట్స్‌పై తమ పేర్లును వేయించాలంటూ అక్కడి ప్రభుత్వాలు జారీచేసిన నిర్దేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

కన్వరీ యాత్రా మార్గంలోని స్టాల్స్‌, హోటల్స్‌ యజమానులు ఆయా స్టాల్స్‌, హోటల్స్‌ నేమ్‌ ప్లేట్లపై తమ పేర్లను వేయించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మొదట నిర్దేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి. దాంతో ఈ నిర్దేశాలను సవాల్‌ చేస్తూ పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్‌లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

యూపీ, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఇచ్చిన నిర్దేశాలపై కోర్టు స్టే విధించింది. అంతేగాక సమాధానం ఇవ్వాలంటూ ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేసు తుదపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఆహారపదార్థాలను అమ్ముకునే వ్యాపారులు నేమ్‌ ప్లేట్లపై పేర్లను వేయించాలని బలవంతపెట్టడం సబబు కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

Search

Latest Updates