సౌమ్యానికి, సంస్కారానికి మారుపేరు కిషన్ రెడ్డి: ఈటెల రాజేందర్

Published on

సౌమ్యానికి, సంస్కారానికి మారుపేరు కిషన్ రెడ్డి అన్నారు ఈటెల రాజేందర్. ఇవాళ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కిషన్ రెడ్డి నామినేషన్ ర్యాలీ, సభలో రాజ్ నాథ్ సింగ్ గారితో కలిసి పాల్గొన్న ఈటల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి అందరి వారు.. వారి దుఖం కన్నీలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదం కిషన్ రెడ్డి గారు ఎప్పటినుండో అమలు చేస్తున్నారు అనడానికి అంబర్పేటలో ఆయన గెలుపే నిదర్శనం. అన్ని వర్గాల వారు ఆయన్ను ఆదరించారని గుర్తుచేశారు. కిషన్ రెడ్డి గారికి కి మంతం కులం లేదు మనుషులు అందరూ సమానమే అని పనిచేశారన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి గారు చేసిన కృషివల్ల ఆ సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఇప్పుడు బీజేపీకి పట్టుకొమ్మలుగా మారాయన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే భాద్యత మోదీ గారు కిషన్ రెడ్డి గారిమీద పెడితే.. అద్భుతంగా పనిచేశారన్నారు. మరోసారి ఆశీర్వదించి పార్లమెంట్ కి పంపించాలనిసికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరారు.

Search

Latest Updates