ఏపీలో డీబీటీ నిధుల విడుదల

Published on

AP: ఆంధ్రప్రదేశ్‌లో డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ (ఈసీ). లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జరీ చేసింది. మే 15, ఒక్కరోజే ఆసరాకు రూ.1480, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రీఎంబర్స్‎మెంట్ రూ.502 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. మిగిలిన పథకలకు నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉంది ప్రభుత్వం.

ఇప్పటికే పలు ఫథకాల లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయగా మిగిలిన వాటికి కూడా రెండు మూడు రోజుల్లో నగదు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం . గతంలో టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‎కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా అడ్డుకున్నారు. అయితే దీనిపై లబ్ధిదారుల్లో కొందరు విద్యార్థులు, మహిళలు ఏపీ కోర్టును ఆశ్రయించారు. తమకు ప్రత ఏటా క్యాలెండర్ ప్రకారం లభించే నిధులను విడుదల చేయాలని పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం విచారణ జరిపింది.

Search

Latest Updates