ఓటరుపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే..

Published on

ఎన్నికల వేళ గుంటూరు జిల్లాలోని తెనాలిలో దారుణ‌ సంఘ‌ట‌న జ‌రిగింది. క్యూలైన్లో నిల‌బ‌డి ఓటు వేయాల‌ని సూచించిన ఓట‌ర్‌పై ఎమ్మెల్యే దాడికి ఒడిగట్టాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది వైర‌ల్‌గా మారింది.

వివ‌రాళ్లోకెళితే తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి ఐతనగర్లో ఓటు వేయటానికి వెళ్లారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే క్యూలైన్లో కాకుండా నేరుగా ఓటు వేయటానికి వెళ్ల‌టంతో లైన్‌లో వేచి ఉన్న‌ ఓటర్ అభ్యంతరం చెప్పాడు. క్యూలైన్‌లో నిలుచొని ఓటు వేయాల‌ని సూచించాడు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఓటర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపపై కొట్టాడు. వెంట‌నే స్పందించిన ఓట‌ర్ ఎమ్మెల్యేను కూడా తిరిగి చెంపపై కొట్టాడు. దీంతో ప‌క్క‌నే ఉన్న ఎమ్మెల్యే అనుచ‌రులు క‌లుగ‌జేసుకుని ఓట‌ర్‌పై పిడిగుద్దులు కురిపించారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఓట‌ర్‌పై జ‌రిగిన దాడిని చూసిన ఓట‌ర్లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఎమ్మెల్యే తీరుపై ఓటర్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే అభ్యర్ధికి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించే అధికారం వుంటుంది తప్ప, అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లే అవకాశం ఉండదు. పైగా ప్రశ్నించిన ఓటర్లపై దాడిచేయడం చట్టరీత్యా చర్యతీసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై ఎలక్షన్ కమీషన్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.

Search

Latest Updates