బీఆర్ఎస్ నాయకురాలు, తన చెల్లెలు కల్వకుంట కవితను తీహార్ జైలులో కలిశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల సమయంలో ప్రచారానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ కవితకు మాత్రం ఇప్పటి వరకూ బెయిల్ లభించలేదు.
లిక్కర్ కేసు కుంభకోణంలో సీబీఐ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఈనెల 21 వరకు ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది న్యాయస్థానం . ఈ కేసులో ఆమె పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను జులై ఆరున చేపడతామని స్పష్టం చేసింది న్యాయస్థానం.