జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌… మావోయిస్టు దళ కమాండర్ మృతి

Published on

జార్ఖండ్‌లో గురువారం మధ్యాహ్నం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఏరియా దళ కమాండర్ బుధ్రామ్ ముండా మరణించినట్లు పోలీసులు తెలిపారు.

రాంచీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) అనూప్ బిర్తరాయ్ మీడియాతో మాట్లాడుతూ అర్కీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొచాంగ్‌లోని సరంద అడవుల్లో గురువారం మధ్యాహ్నం ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిపారు.

మే 25న జరగనున్న 6వ దశ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టించాలనే లక్ష్యంతో కొందరు మావోయిస్టులు సరంద అటవీ ప్రాంతంలో గుమిగూడినట్లు పోలీసులకు సమాచారం అందడంతో భద్రతా దళాలు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టగా మావోయిస్టు ఏరియా దళ కమాండర్ బుధ్రామ్ ముండాను ఎదురుపడ్డట్లు ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆయన చనిపోయినట్లు అనూప్ బిర్తరాయ్ తెలిపారు.

రాంచీ, గిరిది, ధన్‌బాద్ మరియు జంషెడ్‌పూర్ నియోజకవర్గాల్లో ఆరో దశ లోక్‌సభ ఎన్నికలకు రెండు రోజుల ముందు ఎన్‌కౌంటర్ జరిగడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎన్నికల నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత సరిహద్దు ప్రాంతాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక నిఘా, లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఐజీ తెలిపారు.

Search

Latest Updates