టీడీపీని ఓడించి ఎన్టీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తా : కొడాలి నాని

Published on

గన్నవరం వైసీపీ అభ్యర్ధి కొడాలి నాని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాని తెలుగుదేశం పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావాలంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులంతా కష్టపడి గెలిపిస్తే.. తన కొడుకును అధికారంలో కూర్చోబెట్టెందుకు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తారని అన్నారు. అందుకే ఎన్టీఆర్ అభిమానులు గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు నాని.

తెలుగుదేశం పగ్గాలు ఎన్టీఆర్ కు రావాలంటే చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలన్నారు. పెద్ద ఎన్టీఆర్ ను దుర్మార్గుడని, తెలుగుదేశం పార్టీకి పనికిరాడని మెడ పట్టి బయటకు గెంటి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని, టీడీపీ పగ్గాలు అప్పగించేలా ఫ్యాన్స్ బుద్ధిచెప్పాలన్నాడు.

Search

Latest Updates