ధబోల్కర్ హత్య కేసులో ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష

Published on

ప్రముఖ హేతువాది, రచయితా, అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి వ్యవస్థాపకులు నరేంద్ర ధబోల్కర్‌ను హత్య కేసులో ఇద్దరికి జీవిత శిక్ష విధించింది పూణే హైకోర్టు. మరో ముగ్గరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. 2013 ఆగస్టు 20న పుణెలోని మహర్షి విఠల్ రామ్‌జీ శిందె వంతెన వద్ద వాకింగ్కు వెళ్లి వస్తున్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు ధబోల్కర్.

ఈ కేసులో పదకొండేళ్ల తర్వాత 2024 మే 10న తీర్పు వెలువడింది. ధబోల్కర్‌ హత్య కేసులో నిందితులు సచిన్ అందురే, శరద్ కలాస్కర్ దోషులుగా తేలింది. వీరికి యావజ్జీవ కారాగార శిక్ష పాటు ఐదు లక్షల జరిమానా విధించింది. అయితే మిగతా ముగ్గురైనా వీరేంద్ర తావ్డే, న్యాయవాది సంజీవ్ పునలేకర్, విక్రమ్ భవేలను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

కోర్టు తీర్పు అనంతరం డాక్టర్ నరేంద్ర దభోల్కర్ కుమారుడు హమీద్ దభోల్కర్ మీడియాతో మాట్లాడుతూ, ”కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అయితే హత్య వెనక ఉన్న అసలు సూత్రధారులకు శిక్ష పడలేదు. హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం.” అని దభోల్కర్ కుమారుడు అన్నారు

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates