ప్రేమికులకు అండగా నిలిచినందుకు సీపీఎం కార్యాలయంపై దాడి

Published on

తమిళనాడు: కులాంతర వివాహం చేసుకున్న జంటకు అండగా నిలిచి, రక్షణ కల్పించారనే కారణంతో తమిళనాడులోని తిరునల్వేలి సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అమ్మాయి తరపు బంధువులు.

వివరాల్లోకి వెళితే.. మదన్‌కుమార్‌ (28), ఉదయ దాక్షాయిణి (23) వేర్వేరు కులాలకు చెందిన వాళ్లు. గత కొంతకాలంలో ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా జూన్‌ 13న పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో తిరునల్వేలి సీపీఎం ఆఫీసును ఆశ్రయించారు. జూన్ 14న తమ వివాహ రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు వారి రక్షణలోనే ఉన్నారు.

ఇంతలో విషయం తెలుసుకున్న అమ్మాయి తరపున బంధువులు సీపీఎం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కిటికీ అద్దాలు, బల్లలు, కుర్చీలు, తలుపులు ధ్వంసం చేశారు. కార్యాలయంలో ఉన్న మురుగన్, అరుల్ రాజ్‌లపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

తమ జిల్లా కార్యాలయంపై జరిగిన మూకుమ్మడి దాడిని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దంపతులకు రక్షణ కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.

Search

Latest Updates