బీజాపూర్‌లో 30 మంది నక్సలైట్లు లొంగుబాటు..

Published on

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం 30 మంది నక్సలైట్లు సీనియర్ పోలీసు ఆఫీసర్ల ముందు లొంగిపోయారు. వీరిలో 6గురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. 9 మంది నక్సలైట్లపై రూ.39 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నక్సలైట్ల లోపభూయిష్ట భావజాలం, ఆదివాసీల పట్ల వివక్షాపూరిత ప్రవర్తన, నిర్లక్ష్యం చిత్రహింసలతో విసిగిపోయినట్లు.. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పునరావాసం, సరెండర్ పాలసీతో ప్రభావితమైన వీళ్లంతా లొంగిపోయినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

మిట్కీ కకేమ్ అలియాస్ సరిత , మురి ముహందా అలియాస్ సుఖమతిలపై 8 లక్షలు రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.అలాగే అజితా వెట్టి, దేవే కోవాసి, అయతా సోధి, శీను పదం అలియాస్ చిన్నా తలపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు తెలిపారు. మరో ముగ్గురిపై లక్ష రూపాయల రివార్డు ఉన్నట్లు..ఈ తొమ్మిది మంది భద్రతా సిబ్బందిపై పలు దాడుల్లో పాల్గొన్నారని ఆరోపించారు.

లొంగిపోయిన నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ.25,000 అందించామని, ప్రభుత్వ విధానం ప్రకారం పునరావాసం కల్పిస్తామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఏడాది బీజాపూర్జి ల్లాలో ఇప్పటి వరకు మొత్తం 76 మంది నక్సలైట్లు హింసను విడనాడారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates