బీజాపూర్ జిల్లాలో నలుగురు నక్సలైట్లు అరెస్ట్

Published on

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం నలుగురు నక్సలైట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి పేలుడు పదార్థాలు, నిషేధిత పార్టీకి చెందిన కరపత్రాలు, పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు.

బీజాపూర్, భైరామ్‌గఢ్‌కు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), మిర్టూర్ పోలీసులు, ఆర్మ్‌డ్ ఫోర్స్ సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిలో ఒకరిపై రూ.5 లక్షల నగదు రివార్డలు ఉన్నట్లు తెలిపారు. అతనిపై హత్య నేరం, ఐఈడీ పేలుడు, రోడ్డు నరికివేత, కరపత్రాలు పెట్టడం, లెవీ వసూలు తదితర అనేక తీవ్రమైన అభియోగాలు ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు, దంతెవాడలో జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట ఇద్దరు నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో కాకడి పంచాయతీ డికెఎంఎస్ అధ్యక్షుడు ఉమేష్ అలియాస్ భీమా హేమ్లా, గొండెరాస్ పంచాయితీ మిలిషియా ప్లాటూన్ సభ్యుడు జోగా ముచకి ఉన్నట్లు తెలిపారు.

Search

Latest Updates