మూగ యువతిపై దాష్టీకం.. మూడు నెలలుగా అత్యాచారం

Published on

నిన్న తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పసికందుపై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే నేడు ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘటన వెలుగు చూసింది. మూగ యువతిపై గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు కామాంధులు. కూతురు గర్భం దాల్చిందని తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చండ్రపాడులో తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో మూగ, చెవుడు అయిన ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఆ యువతి బలహీనత గమనించిన స్థానిక యువకుడు తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెకు ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. అలాగే నటిస్తూ.. ఏడాదికాలంగా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తానొక్కడే కాకుండా తన స్నేహితులను కూడా తీసుకొచ్చి అత్యాచారం చేయించాడు. తీరా ఆమె గర్భం దాల్చడంతో వారి దుర్మార్గం బయటపడింది. యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. యువతిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి పంపి.. వైద్యపరీక్షలు చేయించారు. బాధితురాలిని బెదిరించి.. ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates