రేవంత్ రెడ్డి సర్కార్‌ను టచ్ చేసే శక్తి ఎవ్వరికీ లేదు, ఆ సర్కార్ ఐదేళ్లు వుంటుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో తాము ఓట్లకోసం రాజకీయం చేయబొమన్నారు. అంబానీ, ఆదానీలతో మోదీ దోస్తనా అందరికీ తెలుసనీ, వాళ్ల ఫ్లైట్లలో ఎవరెవరు తిరిగారో ప్రజలకు బాగా తెలుసన్నారు. పబ్లిక్ సెక్టార్ ఆస్తులను ఆదానీ, అంబానీలకు మోదీ కట్టబెట్టారని విమర్శించారు. దేశంలో సగం సంపద వాళ్లదగ్గరే వుందన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్షీ స్కీం కింద ప్రతి మహిళకు ఖాతాలో ఏడాదికి లక్ష రూపాయలు వేస్తామని, ఖాళీగా వున్న 30 లక్షల ఉద్యోగాలు వెంటనే నింపుతామని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు.