తమిళనాడులోని కుర్తాళంలో విషాదం జరిగింది. పాత కుర్తాళం జలపాతం దగ్గర పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. దీంతో జనం పరుగులు తీయగా అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
ఇటీవల గల్ప్ ఆప్ మన్నార్, కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షం కారణంగా పాత కుర్తాళం జలపాతంలోకి వరద నీరు వచ్చిచేరుతుంది. దీంతో చూసేందుకు పెద్ధ సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో, పాత కుర్తాళం జలపాతాలలో పర్యాటకుల బృందం స్నానాలు చేస్తున్నప్పుడు, పశ్చిమ కనుమలలో అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ఉన్నట్లుండి వరద పెరిగింది. పర్యాటకులు అప్రమత్తమయ్యేలోపు వరద ఉధృతిపెరిగింది. జలపాతాల నుండి కార్ పార్కింగ్‌కు దారితీసే ఎత్తైన మెట్లను నీరు పోటేత్తింది. పర్యాటకులు అహాకారాలు చేస్తూ ఒడ్డుకు చేరుకునేసరికి వరద నీరు కాలనీలను ముంచెత్తింది. దగ్గర్లో ఉన్న పోలీసులు పర్యాటకులను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించారు. అయితే ఈ వరద తాకిడికి పాళయంకోట్టైలోని ఎన్జీవో కాలనీలో 11వ తరగతి చదువుతున్న అశ్విన్ కొట్టుకుపోయాడని గుర్తించారు.
కలెక్టర్ ఎ.కె. కమల్ కిషోర్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ T.P. సురేష్‌కుమార్, అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. జలపాతానికి 500 మీటర్ల దూరంలో రాళ్ల మధ్య చిక్కుకున్న అశ్విన్ మృతదేహాన్ని సాయంత్రం 5.10 గంటలకు వెలికి తీశారు.