సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. సోమవారం ఉదయం పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన బోర్డు తాజాగా 12వ తరగతి ఫలితాలను కూడా విడుదల చేసింది.
పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలు 94.75 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 12వ తరగతి పరీక్షల్లో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండు పరీక్షల ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. తిరువనంతపురంలోనే 99.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విజయవాడలో 99.60 శాతం, చెన్నైలో 99.30శాతం, బెంగళూరులో 99.26శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థుల్లో పోటీతత్వం లేకుండా చేసేందుకు మెరిట్ జాబితాను సీబీఎస్ఈ ప్రకటించడం లేదు.
సుమారు 47 వేల మంది విద్యార్థులు..95 శాతం కన్నా ఎక్కువగా మార్కులు సాధించారు. 2.12 లక్షల మంది 90 శాతం కన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.