గృహ హింస బారిన 30% మంది

Published on

ఐదు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.. ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌-5 నివేదిక వెల్లడి

హైదరాబాద్‌ : తెలంగాణ సహా.. ఐదు రాష్ట్రాల్లో 30ు మంది మహిళలు గృహహింసకు గురవుతున్నారు. కర్ణాటక, అసోం, మిజోరాం, బిహార్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స-5)లో ఈ విషయం స్పష్టమవుతోంది.

గతంలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ప్రస్తుత సర్వేలో 18-49 ఏళ్ల మధ్య గృహహింస బారినపడ్డ మహిళల సంఖ్య పెరిగినట్లు తేలింది. నిరక్షరాస్యత, మద్యపానం వల్లే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పూనం ముట్టర్‌జీ తెలిపారు.

కొవిడ్‌-19కు ముందు కేంద్రపాలిత ప్రాంతాలు, ఎంపిక చేసిన రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని ఆమె చెప్పారు. కాగా, గతంలో గృహహింసను మౌనంగా భరించేవారని, ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో ప్రస్తుతం పరిస్థితులు మారాయని అధికారులు చెప్పారు. బాధితులు ఎదురు తిరిగి ఫిర్యాదు చేస్తున్నారని, ఫలితంగానే గృహహింస కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించారు.

Courtesy Andhrajyothi

Search

Latest Updates