తెలంగాణ ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలైన ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, మంచిర్యాల, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ ముగిసింది.
అదేవిధంగా ఏపీలోని పాడేరు, అరకు, రంపచోడవరంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసినట్లు, అయితే, సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్లలో నిలుచున్న ఓట్లరకు ఓటేసేందుకు అవకాశం కల్పించారు.
నక్సల్స్ ప్రాబల్యం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వుండటం, పైగా లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.