మద్దతుధర దక్కలే..

Published on

– పంట కొనుగోళ్లలో ఎంఎస్‌పీ 77శాతం రాలే..
– మార్కెట్‌ యార్డ్‌ లు మటాష్‌
– నూతన వ్యవసాయ చట్టాలతో రెచ్చిపోతున్న దళారులు

పంట చేతికొచ్చిన సంతోషం రైతుల్లో ఎంతో సేపు నిలవటం లేదు. మార్కెట్‌ మాయాజాలం, దళారుల ఆటలకు రైతులు బలవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఖరీఫ్‌ పంట కొనుగోళ్లే దీనికి నిదర్శనం. ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 11.6లక్షల మెట్రిక్‌ టన్నుల వరి మార్కెట్‌ యార్డులకు రాగా, ఇందులో 8.9 లక్షల మెట్రిక్‌ టన్నుల వరికి (77శాతం) ఎంఎస్‌పీ దక్కలేదు. ఇది ఏ రైతు సంఘమో, రాజకీయ ప్రతిపక్షమో చెప్పిన గణాంకం కాదు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధర్వ్యంలో నడిచే ‘అగ్రిమార్క్‌నెట్‌’ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో వెల్లడించిన సమాచారం. న్యూఢిల్లీ: తెలంగాణ,.ఉత్తరప్రదేశ్‌, కర్నాటక, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో అత్యధికమంది రైతులకు ఎంఎస్‌పీ దక్కలేదని ప్రభుత్వ గణాంకాలే ధ్రువీకరిస్తున్నాయి. సజ్జలు, మొక్కజొన్న, సోయా, మినుములు, కందులు, వేరుశనగ…ఇలా దేంట్లో నూ రైతులకు ఎంఎస్‌పీ ధర లభించలేదని ప్రభుత్వం తాజాగా విడుదల పంట కొనుగోళ్ల సమాచారమే తెలుపుతోంది. దేశవ్యాప్తంగా రైతులంతా కనీస మద్దతు ధర కోసం పోరాడుతున్నవేళ పంట కొనుగోళ్లు ఈ తీరుగా ఉన్నాయంటే, రేపు నూతన వ్యవసాయ చట్టాల అమ లుతో పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఎందుకిలా?
పంట కొనుగోళ్లకు సంబంధించి దేశమంతా ఒక అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఎంఎస్‌పీ ఉండదనీ, మార్కెట్‌ కమిటీలు మూతపడతాయన్న భయాలు పెద్ద ఎత్తున నెలకొన్నా యి. దీనికి కారణం నూతన వ్యవసాయ చట్టాలు. పంట కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుంటోందన్న భయం పెరగడానికి ఆస్కారం ఏర్ప డింది. ఇదంతా కూడా ప్రయివేటు కొనుగోలుదార్లకు, దళారులకు కలిసివచ్చింది. కొత్త చట్టాల్లోని అంశాలు దళారీ వ్యవస్థకు, ప్రయివేటు శక్తుల కు మరింత బలాన్ని ఇచ్చాయని తెలుస్తోంది. ఎంఎస్‌పీ అమలయ్యే పరిస్థితి లేక ప్రయివేటు శక్తులకు రైతు తన పంటను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌ పంట కొనుగోలు లెక్కలూ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. నూతన చట్టాల కారణంగా మార్కెట్‌ యార్డుల వ్యవస్థ అంతా విచ్ఛిన్నమైందని, కనీస మద్దతు ధరపైనా రైతులు మాట్లాడే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు.

క్వింటాకు రూ.1150
కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘అగ్రిమార్ క్‌నెట్‌’ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పొందుపర్చిన గణాంకాల ప్రకారం, క్వింటా వరి రూ.1150-రూ.1868 మధ్య అమ్ముడుపోయింది. 15 రాష్ట్రాల్లోని 292 మార్కెట్‌ యార్డుల నుంచి సేకరించిన సమాచారమిది. ప్రతిఏటా ఖరీఫ్‌ కొనుగోళ్లు అక్టోబరులో మొదలవుతాయి. ఈసారి సాగు అలస్యం కావడంతో కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ పంటలను తీసుకురావటం నెమ్మదించింది. యూపీలో మార్కెట్‌ కమిటీలకు వచ్చిన వరిలో 47శాతం, గుజరాత్‌లో 83శాతం, కర్నాటకలో 63శాతం, తెలంగాణలో 60శాతం పంటకు ఎంఎస్‌పీ ధర దక్కలేదని ‘అగ్రిమార్క్‌నెట్‌’ గణాంకాలు చెబుతున్నాయి.

Courtesy Nava Telangana

Search

Latest Updates