ఎస్సీ వర్గీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం: మంద కృష్ణ మాదిగ

Published on

హైదరాబాద్.ఏఫ్రిల్ 15:M7 ప్రతినిధి ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మండిపడ్డారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజికవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ వర్గీకరణకు చేస్తామని చెప్పడం ఎలా సాధ్యం చేస్తారో వివరించాలని డిమాండ్ చేశారు.మాల సామాజిక వర్గానికి చెందిన ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నారని ఆయన వర్గీకరణకు వ్యతిరేకంగా కర్ణాకటలో పోరాటం చేశారని గుర్తు చేశారు.


కాంగ్రెస్ 5 ఎంపీ స్థానాలు గెలువడం కష్టం. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఐదు స్థానాలు గెలువడం కష్టమేనని ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ జోస్యం చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో కాంగ్రెస్ కు ఎదురుగాలి వీస్తుందని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.రిజర్వేషన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ మాలలకు దోచి పెట్టిందని ఆరోపించారు. జనరల్ స్థానాల్లో రెడ్డీలకు పెద్దపీఠ వేయడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 15 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు మిగతా రెండు స్థానాలు ఏవో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కంటోన్మెంట్ లో మాదిగలకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదు
కంటోన్మెంట్ నియోజికవర్గంలో మాదిగలు మెజార్టీ సంఖ్యలో ఉన్నారని, అటువంటి వారికి బీఆర్ఎస్,కాంగ్రెస్ లు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇక బీజేపీ మాదిగలకు టిక్కెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు మాదిగలకు టిక్కెట్ ఇవ్వకుండా అవమానించారని స్పష్టం చేశారు.మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయో కాలంలో రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాదిగలకు ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించకుండా మోసం చేశారని, గోబ్యాక్ పేరిట ఉద్యమాన్నిఉదృతం చేస్తామని హెచ్చరించారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు శ్రీగణేష్ అర్వ మాల కాగా,సాయన్న కూతురు నివేదిత స్థానిక మాల అని స్పష్టం చేశారు. కానీసం బీజేపీ అయినా స్థానిక మాదిగకు అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో MRPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ MRPS,MSP హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు TV నర్సింహా మాదిగ,MSP హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డప్పు మల్లికార్జున మాదిగ,MSP హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి అజిత్ వాల్మీకి, MSP జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రి సతీష్ మాదిగ, MRPS తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ,MSF తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కంపల్లి శ్రీకాంత్ మాదిగ,MRPS కంటోన్మెంట్ నాయకులు మంద మధుకర్ మాదిగ ,MRPS కంటోన్మెంట్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు

Search

Latest Updates