కాంగ్రెస్ తో సామాజిక న్యాయం జరగదు: మంద కృష్ణ మాదిగ

Published on

కర్ణాటక (ఏఫ్రిల్ 16) : కాంగ్రెస్ పార్టీతో దళితులు, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరగదని….. అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కర్ణాటక రాష్ట్రం చిక్బుల్లాపూర్ జిల్లా లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సుధాకర్ కు మద్దతుగా మంద కృష్ణ మాదిగ మంగళవారం (ఏఫ్రిల్ 16) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డాక్టర్ సుధాకర్ తో కలిసి మాట్లాడారు.సామాజిక న్యాయం ఓబీసీ వర్గానికి చెందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడితోనే సాధ్యమవుతుందన్నారు.అందుకు సాక్ష్యం 10 సంవత్సరాలు మోడీ పాలనలో మొదటి దఫా దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవిద్ ను దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారని, రెండో దఫా గిరిజన కుటుంబానికి చెందిన ద్రౌపది ముర్ము కు రాష్ట్రపతిగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. 2004 నుండి 2014 దేశంలో యూపీఏ కాంగ్రెస్ ప్రబుత్వం అధికారంలో ఉన్నప్పుడు, బ్రాహ్మణులైన ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీలను రాష్ట్రపతులుగా నియమించి, సామాజిక న్యాయ సూత్రానికి తూట్లు పొడిచిందని గుర్తు చేశారు.

ఎస్సీ వర్గీకరణ పై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి హైదరాబాద్ వేధికగా మాదిగలకు మాట ఇచ్చి ఆ దిశగా ముందుకు సాగుతున్నారి చెప్పారు. మూడోసారి నరేంద్ర మోడి ప్రధాన మంత్రి కావడానకిి మాదిగలు బీజేపీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడి పాలన పై ఎలాంటి అవినీతి ఆరోపణలేక, మళ్లీ బీజేపీ అధికారం లోకి వస్తే రాజ్యాంగం పోతది, ప్రజాస్వామ్యం నిలువదని దుష్ ప్రచారం చేస్తున్నారి మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అన్ని వేళలా, అండగా ఉన్న డాక్టర్ సుధాకర్ ను ఈ ఎన్నికల్లో గెలిపుంచుకోవాలని మాదిగలకు సూచించారు. ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.

Search

Latest Updates