మాదిగల పట్ల రాజకీయ వివక్షకు తెరలేపిన కాంగ్రెస్. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షుడు నరేష్ మాదిగ.

Published on

మోత్కుపల్లి దీక్షకు ఎమ్మార్పీఎస్ మద్దతు

M7 న్యూస్ ప్రతినిధి [ఏప్రిల్18]: మాదిగలకు జనాభా ప్రాతిపదికన సీట్ల పంపిణీ కాంగ్రెస్ పార్టీ చేయాలని కోరుతూ సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రివర్యులు మోతుపల్లి నరసింహులు గారు చేపట్టిన దీక్షకు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతును పలికింది ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న మోతుపల్లి గారికి పూలమాలవేసి సంఘీభావాన్ని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మాదిగలకు ఒక్క స్థానం కూడా కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానం చేసిందని అన్నారు జనాభా లెక్కల నుండి మాదిగలను తొలగించిన తంతా అవమానం కాంగ్రెస్ చేసింది అన్నారు రేవంత్ రెడ్డి మాదిగల మీద రాజకీయ అంటరానితనాన్ని చూపెడుతున్నాడని అన్నారు చేసిన తప్పును సరిదిద్దుకోకుండా మాదిగల్లు మభ్య పెట్టే మాటలు మాట్లాడుతున్నాడు అని అన్నారు ఫైరవికారులకు రాజకీయ బ్రోకర్లకు అపాయింట్మెంట్ ఇస్తున్న రేవంత్ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడైన మోత్కుపల్లి కి ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు మాదిగ కాబట్టే మోత్కుపల్లి నరసింహులు మాదిగ కాబట్టే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదా ముఖ్యమంత్రి తేల్చాలని అన్నారు ఎంపీ స్థానాలలో మూడు ఎంపీ స్థానాలలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో సహా నాలుగు టికెట్లు మాదిగలకు ఇవ్వకుండా చేసిన అవమానాన్ని మాదిగ ప్రజలు స్పష్టంగా గ్రహించి ఆగ్రహంతో కాంగ్రెస్ మీద రగిలిపోతున్నారు అని అన్నారు భరించే మాదిగలు అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలేరు అన్నారు కాంగ్రెస్ చేసిన అవమానం పట్ల ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు మాదిగ రాజకీయ నాయకులు ఐక్యత రావాలని కోరారు. ఈ ఎన్నికల్లో మాదిగలంతా ఒక మాట మీద నిలబడి కాంగ్రెస్ ని ఓడించాలని పిలుపునిచ్చారు పార్టీ పట్ల విధేయతతో,జాతి పట్ల విధేయతతోని తన కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నాడు అని అన్నారు . మాదిగ జాతికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మోతుపల్లి గారు గుంత విప్పడంలో ముందు వరసలో ఉంటారని అన్నారు. మోత్కుపల్లి పోరాటానికి మాదిగల మద్దతు ఉంటుందని అన్నారు…

Search

Latest Updates