M7 ప్రతినిధి: ఏఫ్రిల్ 18:ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ అని మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ పార్లమెంట్ పరిధిలోని నాయకనే అఠ్టే మండల పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నపార్లమెంట్ అభ్యర్థి గోవింద్ ఖర్జూలు గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ ను ఎందుకు అమలు చేయలేకపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నేతల తీరు ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఉందని ఎద్దేవ చేశారు. రాబోయేది మోడి ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని మాదిగలకు బీజేపీకి అండగా నిలువాలని సూచించారు. 35 ఏళ్ల ఉద్యమం చివరి అంకానికి చేరిందని ఆ ఫలాలు అనుభవించే సమయం వచ్చిందని వివరించారు.
