ఒంగోలు టౌన్: మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన , మాదిగల సంక్షేమం, చట్టసభల్లో మాదిగల ప్రాతినిథ్యంపైమే 13 న జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు, ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర కమిటీల నిర్ణయం మేరకు సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది.ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఈనెల 24 న ఒంగోలు కేంద్రంగా ,బచ్చల బాలయ్య ఫంక్షనల్ హాల్ లో మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమయ్యే ఒంగోలు పార్లమెంటు సదస్సు కు ప్రతి మండలం, నియోజకవర్గం నుండి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులందరూ వేలాదిగా హాజరై విజయవంతం చేయాలని MRPS జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ విజ్ఞప్తి చేసారు…
