వంద రోజుల్లో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం.

Published on

వికలాంగులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం: మంద క్రిష్ణ మాదిగ‌

హైద్రాబాద్ ఎం7ప్ర‌తినిధి:
వికలాంగుల పెన్షన్లు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గత వంద రోజుల పాలనలో ఆ హామీని నెరవేర్చకుండా వికలాంగులను మోసం చేసిందని వికలాంగుల హక్కుల పోరాట సమితి-( VHPS) , MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.

VHPS తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శ‌నివారం ఉస్మానియా యూనివర్శిటీ టెక్నాలజీ కాలేజీ ఆడిటోరియంలో క‌న్వీన‌ర్ జంగయ్య అద్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంద కృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ” కుటుంబాలకు బారమై , ఎన్నో అవమానాలు పడుతూ భారంగా బతికిన వికలాంగుల సమాజానికి VHPS ఉద్యమం వల్లనే గౌరవం, గుర్తింపు లభించిందని అన్నారు. తెలుగు నేల మీద VHPS అధ్వర్యంలో చేపట్టిన పోరాటాల వల్లనే పెన్షన్లు గణనీయంగా పెరిగాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రూ 6000 పెన్షన్లు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని అన్నారు. కానీ వంద రోజుల పాలనలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఘోరంగా మోసం చేసిందని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల హామీని ఎందుకు అమలు చేయలేదని మంద క్రిష్ణ మాదిగ ప్ర‌శ్నించారు. రూ 6000 పెన్షన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని పేర్కొన్నారు. విక‌లాంగుల పెన్ష‌న్ పెంపు కోసం త్వ‌ర‌లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్ట‌డికి విక‌లాంగులు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. అందుకోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో VHPS జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, VHPS కోర్ కమిటీ చైర్మన్ గోపాల్ రావు, జాతీయ నాయకులు అందే రాంబాబు, మంగమ్మ, తదితరులు పాల్గోన్నారు…

Search

Latest Updates