M7 న్యూస్ ఛానల్ పేద ప్రజల గుండెచప్పుడు – కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

Published on

అన్ని వర్గాలకు ఈ ఛానల్ వేదికగా నిలువాలి

పేద, బడుగు బలహీనవర్గాలకు అండగా ఉండాలి

మంద క్రిష్ణ మాదిగ నాయకత్వంలో M7 న్యూస్ ఛానల్ ప్రారంభం

M7 ప్రతినిధి: M7 న్యూస్ నెట్‌వర్క్ పేద ప్రజల గుండెచప్పుడు కావాలని….ఇది అన్ని వర్గాలకు ఈ ఛానల్ వేదికగా నిలువాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.

సోమవారం సికింద్రాబాద్ తార్నాకలో మంద క్రిష్ణ మాదిగ నాయకత్వంలో నెలకొల్పబడిన యూట్యూబ్ ఛానల్ ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆలోచన ప్రతిభించే విధంగా ఈ ఛానల్ ఉండాలని ఆకాంక్షించారు. పేద, బడుగు బలహీనవర్గాలకు అండగా ఉండాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, నియంతృత్వ ధోరణిలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీయాలన్నారు. M7 న్యూస్ ఛానల్ కలం… గళం…. దళం పేరిట ముందుకు రావడం సంతోషమని చెప్పారు. సామాజిక సమస్యల మీద ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఈ ఛానల్ నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణతో పాటు ప్రపంచలో ఉన్న తెలుగు ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు ప్రతిభింబించే విధంగా ఉండాలన్నారు. ఈ న్యూస్ ఛానల్ భవిష్యత్తులో మంచి పేరు సంపాదిస్తుందని తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

పీడిత సమాజానికి M7 న్యూస్ ఛానల్ గొంతుకగా నిలవాలి: మందకృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద క్రిష్ణ మాదిగ మాట్లాడుతూ పీడిత సమాజానికి ఎంసెవెన్ ఛానల్ గొంతుకగా నిలవాలని ఆకాంక్షించారు. ఏ సమూహం అన్యాయాన్ని ఎదుర్కొడానికి ముందుకు వస్తున్నదో వాళ్ల పక్షాన ఈ ఛానల్ గట్టిగా నిలబడాలన్నారు. ఈ రోజు ఛానల్స్ వారి వారి ప్రయోజనాలకు అనుగుణంగానే పని చేస్తున్నాయని తెలియజేశారు. ఎవరి బాధలు… సమస్యలు సమాజం దృష్టికి రావడం లేదో…. వారిని కేంద్ర బింధువు చేసుకొని ఈ ఛానల్ ముందుకు సాగాలన్నారు.

M7 న్యూస్ ఛానల్ వివక్షలేని … అసమానతలు లేని ఓ నూతన సమాజాన్ని ఆవిష్కరించాలని కోరారు. ఎంసెవెన్ న్యూస్ ఛానల్ ప్రారంభించడానికి వచ్చిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి మందకృష్ణ మాదిగ మాదిగ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ, తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, జర్నలిస్టులు నుంచు అశోక్, ఇ. చంద్రశేఖర్, అశోక్, రామక్రిష్ణ, నర్సయ్య, సోషల్ మీడియా ప్రతినిధులు అనిల్, కోటి, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Search

Latest Updates