మాదిగ‌ల‌ను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ: మందకృష్ణ మాదిగ

Published on

మాదిగలను పార్లమెంట్కు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మార్పీఎస్ అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి బషీర్బాగ్ ప్రెస బ్లో మాట్లాడారు. ఎంతో కాలంగా కాంగ్రె స్ పార్టీకి సేవలు అందిస్తున్న అద్దంకి దయా కర్ను విస్మరించి, అర్హత లేని వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఆక్షేపించారు. తుంగతు ర్తిలో అతి తక్కవ ఓట్ల తేడాతో ఓడిపోయిన అద్దంకి దయాకర్.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయడానికి అసలైన అర్హుడు అని కొనియాడారు. సీట్ల అంశంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి నిర సనగా మే 4న జరగనున్న ధర్నా కార్యక్ర మంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

  • మా రిజర్వేషన్ ఉన్నాక మమల్ని కాదు అని పక్కకి పెట్టె అధికారం రేవంత్ రెడ్డి కి ఎవరు ఇచ్చారని నిలదీశారు. మాదిగల ఓట్ల వల్లనే అధికారంలోని వచ్చిన కాంగ్రెస్ పారీ్టకి మా ఓట్ల విలువ మీకు తెలియటం లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ మాదిగలకు 13 మంది ఎమ్మెల్యే సీట్లు ,3 పార్లమెంట్ సీట్లు ఇచ్చారని, అలాగే బీజేపీ పార్టీ రెండు పార్లమెంట్లు , ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. మా మాదిగల జనాభా 80 లక్షలకు పైగా వున్నందునే ఆ పార్టీలు గుర్తింపు ఇచ్చాయనే విషయాన్ని గుర్తించుకోవాలని, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడ ఇవ్వలేదని మాకు ఆ అర్హత లేదా అని నిలదీశారు.

తన జీవిత కాలంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసా కానీ ఇలాంటి పాలనా చూడలేదన్నారు. ఒక్క కుటుంబానికి రెండుసీట్లు ఇచ్చారు కానీ మాదిగలను పట్టించుకోలేదన్నారు. మా జాతిని నిర్వీర్యం చేయాలనీ కుట్ర జరగుతుంది పార్లమెంట్ లో బిల్ వస్తే మాట్లాడటానికి ఒక్క మాదిగ బిడ్డ వద్దా అని విమర్శించారు.

తాను కాంగ్రేస్ పార్టీకి చెందిన వాడినే అయి నా మాదిగలకు అన్యాయం జరిగితే సహించేది లేదని మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఎన్నో ఆశలతో బీఆర్ఎస్ ్ను కాదని, కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మూడు రోజుల్లోనే రేవంత్ కంటే కేసీఆర్ నయం అనిపించేలా చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. యువకుడని సీఎం కుర్చి ఇస్తే తన జమీందారీ ప్రవర్తనతో మాదిగలను ఎదగనీయకుండా ప్రయత్నిస్తున్నారంటూ ఎండగట్టారు. ఈ ఎన్నికల్లో మాదిగల మద్ద తు లేకుండా 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ విసిరారు. ఒకే కుటుంబంలో ఉన్న వారికి రెండు సీట్లు ఎలా ఇస్తారని, ప్రశ్నించిన ఆయన మాదిగ లకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు.

ఈ ఎన్నికల్లో తాను 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హెచ్చరిం చారు. ప్రగతి భవన్ లో ప్రజాపాలన కార్యక్ర మాన్ని మూడు రోజుల ముచ్చట చేశారని మండిపడ్డారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా నిరహర దీక్ష చేపడుతామని చెప్పారు. మాదిగలకు సీట్లు ఇవ్వకుండా మద్దతు మాత్రం కావాలా అని రేవంతన్న మోత్కుపల్లి నిలదీశారు. ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో పొలాలు ఎండి పోతున్నాయని, కరెంటు లేదని, దళిత బంధు లేదని, తులం బంగారం ఊసే లేదని దుయ్యబట్టారు. మహాలక్ష్మి పథకం అమలు ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను కేంద్రంలో అధికారం లోకి తీసుకురావాలని సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ కష్టపడుతుంటే.. అధిక జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని దూరం చేసుకునేందుకు సీఎం ప్రయత్నిస్తు న్నారని ఆరోపించారు. మాదిగల సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వద్దని, కాంగ్రెస్ అధి ష్టానం చెప్పిందా అని నిలదీశారు.

Search

Latest Updates