80 లక్షల మాదిగలకు కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసింది : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ.

Published on

కాంగ్రెస్

రేపే మే 04, ఛలో ఇందిరా పార్క్.

  • మాదిగ జాతిని రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని అందులో భాగంగానే 80 లక్షలకు పైగా జనాభా ఉన్న మాదిగలకు రాజకీయంగా అవకాశమే లేకుండా కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసిందని, ఆనమ్మకద్రోహాన్ని ఎండగట్టేందుకు రేపు మే 04 ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాకు మాదిగలు తరలిరావాలని MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ పిలుపునిచ్చారు.జనగామ జిల్లా కేంద్రంలో ఎంఎస్పి, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల ఉద్యమ సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి సందేన రవీందర్ మాదిగ అధ్యక్షత వహించగా, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు గద్దల కిషోర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పైసా రాజశేఖర్ మాదిగతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాలు మరియు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు స్థానమే లేకుండా చేసి మాదిగల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. 80 లక్షలకు పైగా జనాభా ఉన్నా, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా మాదిగలను జనాభా లెక్కల నుండే తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలలో మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం కనుమక్రమంగా తగ్గుతుంటే, కాంగ్రెస్ మాత్రం రాజకీయ సమాధి చేసిందని అన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే టికెట్ల కేటాయింపు చేస్తామని, ఇంట్లో ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తామన్న ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ తన నిబంధన ఏమైందని..? ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి, ఇద్దరికీ టికెట్లు ఇచ్చి మాదిగల్ని విస్మరించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్లో గడ్డం వివేక్, మల్లు భట్టి విక్రమార్క కుటుంబాలకి ఉన్న విలువ మాదిగ జాతికి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం కొరవడిందని, మాదిగలకు అవకాశమే కల్పించకుండా ద్రోహం చేస్తే, జనరల్ స్థానాల్లో బీసీల కేటాయించాల్సిన సీట్లను సైతం రెడ్లకు దోచి పెట్టారని మండిపడ్డారు. మాదిగల అండతో రాజకీయంగా ఎదిగానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాలలతో కుమ్మక్కై నేడు నీకు జీవం పోసిన మాదిగలను రాజకీయంగా అణిచివేసే చర్యలకు పూనుకోవడం ద్రోహం చేయడమే అవుతుందని గుర్తుచేశారు. మాదిగల ఆవేదనతో చెలగాటమాడితే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. కాంగ్రెస్ అణిచివేత ధోరణిని తెలంగాణ పౌర సమాజం గమనించాలని కోరారు. కాంగ్రెస్ మాదిగలకు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ మాదిగల అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే రేపు ఇందిరా పార్కు వద్ద “మహాధర్నా” చేపడుతున్నామని, ఈధర్నాను విజయవంతం చేయడం కోసం మాదిగలు, సామాజిక న్యాయాన్ని కోరే సబ్బండ వర్గాలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈమహాధర్నాకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నర్సింహులు గార్లు మరియు ఇతర రాజకీయ పెద్దలు హాజరుకానున్నారని, మాదిగల అస్తిత్వం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం సమరానికి సన్నద్ధం కావాలని, నేడు చేస్తున్న కుట్రలను, జరుగుతున్న నష్టాన్ని గ్రహించి, రేపటి ప్రమాదాన్ని గుర్తెరిగి, జాతి రాజకీయ భవిష్యత్తు, మనుగడ కోసం రాజకీయాల కతీతంగా ప్రతి గ్రామము నుంచి మహాధర్నాకు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గువ్వల రవి మాదిగ, గడ్డం సోమరాజు, నరసింగ రవి మాదిగ, నల్ల ఉపేందర్ మాదిగ, కంతి రాము మాదిగ, శ్రావణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Search

Latest Updates