తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

Published on

తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం వుండని తెలిపింది. గంటకు 40 కిలో మీటర్ల వేగంలో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

కాగా గత రాత్రి హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షంతో జిల్లాలో పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడగా, హైదరాబాద్ నగరంలో తీవ్ర ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెట్లు కూలిపోయి విద్యుత్‌కు అంతరాయం కలగడంతో పలు కాలనీలలో అంధకారం అలుముకుంది.

Search

Latest Updates