చంద్రబాబు గాడిద కాళ్లైన పట్టుకుంటాడు :కొడాలి నాని

Published on

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నకలు..మంగళగిరిలో నారా లోకేష్ గెలిచే సీన్ లేదని కామెంట్స్ చేశారు కొడాలి నాని. గురువారం నందివాడ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం అవసరమైతే గాడిద కాళ్లైన పట్టుకుంటాడని విమర్శించాడు.

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంతో సేవ చేశారని, వాళ్లందరి మద్దతు జగన్ మోహన్ రెడ్డికి ఉంటుందన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని, లోకేష్ మంగళగిరిలో కూడా గెలవడని అందుకే మతి భ్రమించి సీఎం గురించి నోటికొచ్చినట్లు మాట్టాడుతున్నాడని విమర్శించాడు.

Search

Latest Updates