కర్ణాటక నుంచి తెలంగాణకు నీరు విడుదల

Published on

తెలంగాణలో ఏర్పడిన నీటి నీటి ఎద్దడి దృష్ట్యా కర్ణాటక నుండి నీటి విడుదలకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ సారి వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండటం, ఉష్ణోగ్రతలు గతం కంటే ఎక్కువ నమోదు కావడంతో తీవ్ర నీటి సమస్య మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే రంగంలోకి దిగింది. కర్ణాటకతో సంప్రదింపులు జరిపింది. తెలంగాణ ప్రభుత్వ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేసిన కర్నాటక ప్రభుతం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మొత్తం 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరింది. కానీ అక్కడి పరిస్థితులన్నింటిని అంచనా వేసుకొని.. మొదట 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది కర్ణాటక.

అయితే నారాయణపూర్‌ నుంచి జూరాల ప్రాజెక్ట్‌కు మధ్య ఉన్న దూరం 55 కిలోమీటర్లు మాత్రమే కానీ 1.9 టీఎంసీల నీరు జూరాలకు చేరుకునే సరికి కేవలం ఒకటిన్నర టీఎంసీ మాత్రమే మిగులుతుందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ వచ్చే మూడు నెలల పాటు నీటి అవసరాలు తీరుతాయని ఈ లోపు వర్షాలు కురిస్తే సమస్య నుండి గట్టెక్క వచ్చని ప్రభుత్వ ఆలోచన.

Search

Latest Updates