ఢిల్లీని కుదిపేసిన దుమ్ము తుఫాను…!

Published on

  • ఇద్దరు వ్యక్తులు మృతి
  • 23 మంది గాయాలు
  • తొమ్మిది విమానాలు దారి మళ్లింపు

దేశరాజధాని ఢిల్లీ అర్థరాత్రి దుమ్ము తుఫాను (Dust Storm) కుదిపేసింది. దీనికి తోడు ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో జనజీవనం స్తంభించింది. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. దుమ్ము తుఫాను కారణంగా చెట్లు, గోడ కూలిన ఘటనల్లో సుమారు ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 23 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు ఈ తుఫాను కారణంగా విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు తొమ్మిది విమానాలను జైపూర్‌కు దారి మళ్లించారు.

ఈరోజు కూడా దేశ రాజధానిలో వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది

Search

Latest Updates