బంగ్లాదేశ్‌లో ఘ‌ర్ష‌ణ‌.. 105కు చేరిన మృతుల సంఖ్య‌

Published on

బంగ్లాదేశ్‌లో యువ‌త భ‌గ్గుమంటున్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా అల్ల‌ర్లు చోటుచేసుకుంటున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌ర్ఫ్యూ విధించారు. నిర‌స‌న‌కారుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 105 మంది మ‌ర‌ణించారు.

బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం 1971లో జరిగిన యుద్ధంలో మరణించిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్‌లలో 30 శాతం కోటా కల్పిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడి వర్సిటీల విద్యార్థులు, ప్రజలు కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు బుధవారం రెండు బస్సులకు నిప్పు పెట్టారు.

ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు రబ్బరు బులెట్లు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. కొన్నిచోట్ల అధికార అవామీ లీగ్‌ విద్యార్థి సంఘం నాయకులు.. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణలు జరిగాయి.

మ‌రో వైపు బంగ్లాదేశ్‌లో ఉన్న 245 మంది భార‌తీయ పౌరులు స్వ‌దేశం తిరిగి వ‌చ్చారు. బంగ్లాలో గ‌త మూడు వారాల నుంచి నిర‌స‌న‌లు వెళ్లువెత్తుతున్నాయి. శాంతియుత ప‌రిష్కారం కోసం విద్యార్థులు ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాని షేక్ హ‌సీనా తెలిపారు.

Search

Latest Updates