గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ అమెరికాలోని 35 యూనివర్సిటీల్లో ఉద్యమిస్తున్న 2 వేల మంది విద్యార్థులను అక్కడి భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షడు జో బైడెన్ స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో భిన్నా భిప్రాయాలు ఉండడం మంచి దేనని, కానీ ఆ అభిప్రాయాలు వ్యవస్థలు ఛిన్నా భిన్నం కావడానికి కారణం కాకూడదని హితవు పలికారు.
విద్యార్థుల నిరసనలపై నేపథ్యంలో గాజా దాడులపై అమెరికన్ ప్రభుత్వం తన వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోదని, ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఎప్పటిలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు.