దళితులకు శుభవార్త.. SC వర్గీకరణపై కేంద్రం సంచలన నిర్ణయం

Published on

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం జీవో జారీ చేశారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఐదుగురు ప్రముఖులు సభ్యులుగా ఉండనున్నారు. కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక, న్యాయశాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన దళిత దండోర సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన హామీ ప్రకారం కమిటీని ఏర్పాటు చేశారు.

Search

Latest Updates