బాలగోపాల్ రచనలు ఎస్సీ వర్గీకరణకు దారి చూపెట్టాయి – మంద కృష్ణ మాదిగ.
వివరణ :- ఎస్సీ వర్గీకరణ పోరాటం సుప్రీం కోర్టు తీర్పు ద్వారా విజయతీరాలకు చేరిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గారు మానవ హక్కుల నేత బాల గోపాల్ గారి ఇంటిని సందర్శించారు.వారి సతీమణి వసంత లక్ష్మిగా గారిని గౌరవ పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బాల గోపాల్ గారి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.అనంతరం వసంత లక్ష్మీ గారితో మాట్లాడారు.
ప్రజా దృక్పథంతో అభిప్రాయాలను నిర్దిష్టంగా, నిక్కచ్చిగా చెప్పడంలో బాల గోపాల్ గారిని మించిన మేధావి లేరని అన్నారు.
2004 లో ఎస్సీ వర్గీకరణను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ అద్భుతమైన వ్యాసాలు రాసి, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ బద్దంగా ఎంత న్యాయమైనదో, రాష్ట్రాలు అధికారాలు ఎలా కలిగి ఉన్నాయో స్పష్టంగా తెలియజేసారని అన్నారు.ఆయన రాసిన రచనలే మొన్నటి సుప్రీం కోర్టు తీర్పుకు దారి చూపాయని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ పోరాటం సఫలీకృతం అయినందుకు బాల గోపాల్ గారు ఉండి ఉంటే సంతోషించే వారని ఇరువురు అభిప్రాయపడ్డారు.
ఇప్పటి పరిస్థితిలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే సుడో మేధావులకు దీటైన జవాబు ఇచ్చే వారని అన్నారు.
ఈనాటి సమాజానికి బాల గోపాల్ గారు లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.
ఈ సందర్భంగా వసంత లక్ష్మీ గారు రిజర్వేషన్ల మీద బాల గోపాల్ గారు రాసిన పుస్తకాన్ని మంద కృష్ణ మాదిగ గారికి అందించారు.