కాంగ్రెస్ లో కొరవడిన అంబేద్కర్ స్పూర్తి .మంద కృష్ణ మాదిగ.

Published on

హైదరాబాద్. ఏఫ్రిల్ 14 .భారత రత్న అంబేద్కర్ 133వ జయంతిని పురష్కరించుకుని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మంద కృష్ణ మాదిగ నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్పూర్తి కొరవడిందని ఆరోపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత… దేశానికి సేవలు అందించిన మాహానీయులకు అవమానం తప్పలేదని మండిపడ్డారు.

మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఉదయం 7 గంటలకే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారని, రేవంత్ రెడ్డి వారిని అనుసరించలేదని, సోయి తప్పారని ద్వజమెత్తారు.అంబేద్కర్ స్ఫూర్తి,సామాజిక న్యాయాన్ని తొంగలో తొక్కి ఓవర్గానికి మాత్రమే పెట్టపీఠ వేయడం సరికాదన్నారు.మూడ్లు రిజర్వు స్థానాలు ఉంటే మాదిగలకు కనీసం ఒక్క ఎంపీ సీటైనా కెటాయించకపోనడం బాధాకరమన్నారు.

కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఉపఎన్నికల్లో మాదిగలకు టిక్కెట్ ఇవ్వకుండా అవమానించారని మంద కృష్ణ ఆరోపించారు.ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు ఒకే వర్గానికి చెందిన వారు కాగా ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం మాదిగలకు కల్పించకపోవడాన్ని తీవ్రంగా పరిగనించారు. కాంగ్రెస్ పార్టీ,సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేసిందని ద్వజమెత్తారు.కాంగ్రెస్ నాయకులు మాదిగ వాడల్లోకి ఎన్నికల ప్రచారం కోసం వస్తే వారిని అడ్డుకోవాలని మాదిగలకు సూచించారు. మరోవైపు రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మాదిగల ఓట్లు అడిగే అర్హత లేదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి మాదిగలు రగిలిపోతున్నారని పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో మాదిగల తిరుగుబాటు ఎలా ఉంటుందో ఆ పార్టీ నేతలు తప్పక రుచి చూస్తారని హెచ్చరించారు..

Search

Latest Updates