2 కోట్ల మంది బాలికలు బడికి దూరం

Published on

– కరోనా విజృంభణతో చదువుకు బ్రేక్‌
– భారత్‌ సహ మధ్య ఆదాయదేశాల్లో ఆగిన విద్య

న్యూఢిల్లీ. కరోనా వినాశనం నుంచి కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నదృష్ట్యా భారత్‌ సహ మధ్య ఆదాయ కలిగిన దేశాల్లో సుమారు రెండు కోట్ల మంది బాలికలు పాఠశాలలకు తిరిగిరాలేదు. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్య ప్రభావితమైంది. ఇది బాలికల విద్యపై తీవ్ర ప్రభావం చూపనున్నదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచెందుతున్నారు. ఓ వైపు మహిళా సాధికారత కోసం ప్రపంచ సాధికారత కోసం ప్రచారాలు జరుగుతున్నాయి, మరోవైపు మన దేశంలోనే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికల్లో 40 శాతం మంది పాఠశాలకు వెళ్ళటంలేదు. వీటితో పాటు నాలుగేండ్లుగా పాఠశాలకు హాజరు కాలేకపోతున్న అమ్మాయిల సంఖ్య రెట్టింపు అయింది. కరోనా ముందు.. కరోనా తర్వాత యునెస్కో విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

దీనిపై సెంటర్‌ ఫర్‌ బడ్జెట్‌ అండ్‌ పాలసీ స్టడీస్‌ (సీబీపీఎస్‌) మలాలా ఫండ్‌ సహకారంతో బీహార్‌లో ఒక అధ్యయనం చేసింది. పాఠశాల మూసివేసినప్పుడు బాలికల కోసం డిజిటల్‌ లెర్నింగ్‌ ఎంతవరకు పనిచేస్తున్నది. ఆ సౌకర్యం ఎంతమందికి అందుబాటులో ఉన్నది..దీనిపై అధ్యయనం చేసింది. కరోనా కారణంగా మార్చి 21 నుంచి దేశంలోని దాదాపు అన్ని పాఠశాలలు మూసివేయబడ్డాయని గుర్తించింది. చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కరువవయ్యాయని గమనించింది.

ఇలాంటి పరిస్థితుల్లో చెప్పే ఆన్‌లైన్‌ బోధన… ముఖ్యంగా అమ్మాయిలకు ఉపయోగపడటంలేదని తేలింది. 47 శాతం మంది పిల్లలకు ఫోన్‌ సౌకర్యం ఉన్నదనీ, వారిలో కేవలం 31 శాతం మందికి మాత్రమే స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నదని అధ్యయనంలో గుర్తించింది. ఇందులో కూడా చాలా మంది అమ్మాయిలు చదవడానికి ఫోన్‌ పొందలేకపోతున్నారు. వాస్తవానికి, మొబైల్‌ , ఇంటర్నెట్‌ సదుపాయం ఒక ఇంట్లో ఒకే వ్యక్తి దగ్గర ఉంటే ..ఆ ఇంట్లో ఇద్దరూ చదువుతుంటే, బాలుడి అధ్యయనానికి ప్రాధాన్యత లభిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిల ఈ సెషన్‌ వృథా అవుతున్నదని పరిశోధించింది.

కరోనా ముగిశాక.. టీనేజ్‌ అమ్మాయిల వివాహం కూడా చదువు ఆపడానికి మరో కారణం అవుతున్నది. యూనిసెఫ్‌ గణాంకాలు ప్రకారం, 18 ఏండ్లలోపు కోటిన్నర మంది భారతీయ బాలికలు వివాహం చేసుకుంటారు. దీని తరువాత చదువుకునే ప్రశ్న లేదు, కానీ చిన్న వయసులోనే తల్లి కావడం వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. 2005 – 2006 సంవత్సరాల మధ్య 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల వివాహ రేటు సుమారు 20 శాతం పడిపోయింది, కానీ 2015-2016 సంవత్సరంలో ఈ గ్రాఫ్‌ మరోసారి పెరిగింది.

ఇప్పుడు కరోనా తరువాత, చిన్న వయస్సులోనే బాలికల వివాహం యొక్క గ్రాఫ్‌ మరింతగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. జనాభా అంచనా ప్రకారం రాబోయే 10 సంవత్సరాలలో 13 మిలియన్లకు పైగా బాలికలు చిన్న వయస్సులోనే వివాహం చేసుకుంటారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇది కరోనాకు ముందే బాలికల వివాహానికి ఎంత మంది బాలికలు ప్రభావితమయ్యారో స్పష్టం చేసింది.

ఇవి కాకుండా పాఠశాల మూసివేత యొక్క బాలికలపై మానసిక ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం వారు నిరంతరం గృహ హింసకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌ అయిన రెండు వారాల్లోనే, పిల్లలు సంప్రదించే కాల్స్‌ 50 శాతం పెరిగాయని చైల్డ్‌ లైన్‌ ఇండియా అంగీకరించింది. ఈ కాల్స్‌ చాలావరకు బందీఖానాలో అనేక రకాల హింసను ఎదుర్కొంటున్న అమ్మాయిల నుంచి వచ్చాయంటే పరిస్థితి ఏ స్థాయిలోఉన్నదో అర్థమవుతున్నది.

కరోనా ఖైదీలుగా ఉన్న కుటుంబాలు పేదరికంతో బాధపడుతున్న టీనేజ్‌ బాలికలు పాఠశాలల నుంచి దూరమయ్యేలా సమాజంలోని పరిస్థితులు ప్రభావితం చేస్తున్నాయి. చ%దీaషసుశీశీూషష్ట్రశీశీశ్రీ% ప్రచారం కింద ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా సంస్థలు బాలికల విద్య గురించి హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా, పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి మాధ్యమిక విద్యపై శ్రద్ధ వహిస్తున్నాయి.
2014 లో ఆఫ్రికన్‌ దేశాలలో ఎబోలా మహమ్మారి విజృంభించాక..అక్కడ బాలికలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చిన్న వయసులోనే వివాహాలు,మాతృత్వం లాంటి సవాళ్లను ఎదురయ్యాయి. దీన్ని నియంత్రించటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఇపుడు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కాలంలో ఆఫ్రికన్‌ దేశాల్లో ఆడబిడ్డలకు ఎదురైన కష్టాలు..మరోసారి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనిపిస్తున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Courtesy Nava Telangana

Search

Latest Updates