కాంగ్రెస్‌ది మోసం…రేవంత్ రెడ్డిది నమ్మక ద్రోహం: కృష్ణ మాదిగ ఫైర్..

Published on

పార్లమెంట్ ఎన్నికల సీట్ల కేటాయింపులో మాదిగలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే… సీఎం రేవంత్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మంద కృష్ణ మాదిగ ద్వజమెత్తారు.ఏఫ్రిల్ 11 గురువారం సూర్యపేటలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్వుర్డ్ స్థానాలైన వరంగల్, పెద్దపెల్లి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల సీట్ల కెటాయింపులో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించలేదని విమర్శించారు.

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు రెండు ఎంపీ సీట్లు కేటాయించాల్సి ఉండగా ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మాదిగల మద్దతుతో రాజకీయంగా ఎదిగినట్లు చెప్పుకునే రేవంత్ రెడ్డి,తాను సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారిని విస్మరించారని దుమ్మెత్తారు.కాంగ్రెస్ పార్టీ మా సమస్యకు పరిష్కారం చూపకుండా, జవాబు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.చివరికి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా మాదిగలకు సీటు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీని మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సీట్ల లో మార్పులు చేయకపోతే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.

మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ మొఖంతో మాదిగ వాడల్లోకి వచ్చి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాదిగలను పరిగనలోకి తీసుకోలేదని, ఒక్క సీటు కూడా కేటాయించకుండా అన్యాయం చేసిందన్నారు.సీట్ల కెటాయింపు విషయం పై పునరాలోచన చేయాలని, మా సమస్యకు పరిష్కారం చూపి, జవాబు చెప్పాలని కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. చేసిన తప్పను సరిదిద్దుకొని మాదిగలకు న్యాయం చేయాలని కోరారు..కాంగ్రెస్ పార్టీ లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సీంలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన విషయాన్ని ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ గుర్తు చేశారు.

జగ్గారెడ్డి మా సగం సోదరుడు…

మా సంగం సోదరుడైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మా పై విమర్శలు చేయడాన్ని ఆశ్యాస్పదమని కొట్టిపారేశారు. తానేదో బీజేపీ బౌండరిలో నుండి మాట్లాడుతున్నానని, జగ్గారెడ్డి కాంగ్రెస్ లో మాదిగలకు టిక్కెట్ ఇవ్వకపోవడం పై ఎందుకు స్పందించ లేదని మంద కృష్ణ ప్రశ్నించారు. గతంలో బీజేపీ నుండి జగ్గారెడ్డి పోటీ చేసిన విషయాన్ని మరిచిపోవద్దని గుర్తు చేశారు.సీఎం రేవంత్ రెడ్డి మా కంటిని మావేలుతో పొడిపించే విధంగా విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. మొన్న సంపత్ కుమార్‌తో, నేడు జగ్గా రెడ్డి‌తో మాపై ఎదురుదాడి చేయించడం, కాంగ్రెస్ పార్టీకి మేలు కంటే కీడే జరుతుందని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి దామోదర్ రాజనర్సింహా‌కు విలువ, గౌరవం లేదన్నారు. ఇటీవల బాబు జగ్దీవర్ రామ్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రంలో ఆయన పేరు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న, వినయ్ బాబు, చింతపాటి చిన్న శ్రీరాములు,ఎర్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.

Search

Latest Updates