గ్యాస్ పై రూ.50 బాదుడు

Published on

– మళ్లీ భారీగా పెరిగిన ధరలు..
– ధరలు వెంటనే అమల్లోకి.. సామాన్యుడిపై మరో పిడుగు

న్యూఢిల్లీ : నిత్యంపెరుగుతున్న పెట్రో ధరలతో ఇప్పటికే సామాన్యులు, వాహనదారులు సతమతమవుతున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు వారిపై మరో పిడుగుపడింది. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ (ఎల్పీజీ గ్యాస్‌) ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. ఈ మేరకు దేశీయ చమురు సంస్థలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. అయితే చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో సామాన్యులపై ఒక్కో సిలిండర్‌పై రూ. 50 భారం పడనున్నది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. కాగా, పెరిగిన ధరలతో సామాన్యుల జేబులకు చిల్లులు పడనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర రూ. 594 నుంచి రూ.644కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర ఇప్పటి వరకు రూ.646.50 గా ఉన్నది. అయితే తాజాగా పెరిగిన ధరలతో అది రూ.696.5కు పెరిగే అవకాశం ఉన్నది. అయితే ఎల్పీజీ ధరలు దేశంలోఇన ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఉంటాయి.

ఇప్పటికే కరోనా కారణంగా దేశంలోని ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. కేంద్రం కూడా ప్రజలను ఆదుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు గ్యాస్‌ ధరలు కూడా పెరిగిపోవడంతో ఇది సామాన్యులపై మరింత భారం పడనున్నదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని పెరుగుతున్న పెట్రో, డీజీల్‌, వంట గ్యాస్‌ ధరలను అదుపులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌లతో ఉద్యోగాల్లేక అల్లాడుతున్న పేదకు టుంబాలపై ధరాఘాతం వేస్తున్న తీరుపై మహిళా,ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

Courtesy Nava Telangana

Search

Latest Updates