రైల్వేల గురించి మాట్లాడే హ‌క్కు కాంగ్రెస్ నేత‌ల‌కు లేదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Published on

తెలంగాణలో కల్వకుంట్ల పాలన పోయి.. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. ఇదేనా మార్పు..?

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని 2018లో కేసీఆర్ హామీ ఇచ్చిండు. ఇంతవరకు నిర్మించలేదు. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టిండు. రూ.3,600 కోట్లతో దాదాపు 200 కి.మీ.ల పొడవున చేపట్టనున్న రామగుండం-మణుగూరు కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహిస్తోంది. రైల్వేల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు. రేవంత్ రెడ్డికి మా సవాల్….. రైల్వేల కోసం యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో.. మోదీ గారు వచ్చాక ఎన్ని నిధులు ఇచ్చామో అనే విషయం చర్చకు రావాలి. తెలంగాణలో కల్వకుంట్ల పాలన పోయి.. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. ఇదేనా మార్పు..? వరంగల్ ఎల్కుర్తి గ్రామంలో 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ మంజూరు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సహకారం అందించలేదు. కొత్త నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో దేశంలోనే మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) ను ఏర్పాటు చేసింది. దీన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. తెలంగాణలో కల్వకుంట్ల పాలన పోయి.. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. ఇదేనా మార్పు..? అప్పుడు కేసీఆర్ హామీలిచ్చి మసిపూసి మారేడుకాయ చేసేవారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలకు హామీలిచ్చి.. గాడిదగుడ్డు ఇస్తున్నాడు. 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి మార్కును రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా తయారైంది. 28,942 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉంచిన నియామకాలకు సంబంధించి అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చి కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారు.కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా తెలంగాణ ప్రజల బతుకు మారింది. తెలంగాణలో కేసీఆర్ పీడ పోవాలని ప్రజలు ఓడిస్తే.. మరో భయంకరమైన, దుర్మార్గమైన, అబద్ధాల, గాడిదగుడ్డు పాలన వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ హోర్డింగులతో ప్రజలకు అబద్ధపు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ 5 నెలల పాలనలో ఒక్క తెల్ల రేషన్ ఇచ్చింది లేదు. కాని తెల్లరేషన్ కార్డులు ఇచ్చినట్లు హోర్డింగులతో అడ్వర్టైజ్ మెంట్లతో ప్రచారం చేసుకుంటున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు రూ. 10 లక్షల ప్రమాదబీమా ఇవ్వలేదు. 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశామంటూ, దావోస్ నుంచి రూ. 40 వేల 232 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారంటూ, హోంగార్డులు, జర్నలిస్టులకు రూ. 5 లక్షల బీమా కల్పించినట్లు మెట్రో పిల్లర్లపై హోర్డింగులతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. రీజినల్ రింగురోడ్డును సైతం కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. రీజినల్ రింగురోడ్డుకు కర్త,కర్మ,క్రియ బిజెపినే. పంటల బీమా పథకం పునరుద్ధరణ అంటూ అబద్ధాలు చెప్తోంది. 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ రెండో యూనిట్ ను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభిస్తే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటోంది. రూ.58000 కోట్లతో మూసీ అభివృద్ధి అన్నరు… నిధులు విడుదల చేసింది లేదు. గ్యారెంటీలలో మరొకటి.. మహిళలకు కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చారు..? కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రూ.500 కే సిలిండర్ అర్హులందరికీ ఇవ్వాలి. ఈ విషయంలోనూ అందరికి కాదు.. కొందరికే అంటూ కండిషన్లు పెట్టింది. ప్రగతి భవన్ కంచెలు కూల్చి ప్రజా భవన్ ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారు.. కంచెలు కూల్చారు తప్పితే ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తీసుకొని… సమస్యలు పరిష్కరించిందిలేదు. ప్రజావాణి దరఖాస్తులు తీసుకుని ట్రంకుపెట్టెలో పెట్టారు… మరికొన్ని చోట్ల ప్రజావాణి దరఖాస్తులు చెత్తకుప్పల్లో దర్శనమిచ్చాయి. ప్రజావాణికి ముఖ్యమంత్రి హాజరైంది లేదు. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం చెందారు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం.. ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కులేదు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే భారతీయ జనతా పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగూ అధికారంలోకి రాలేదనే ఉద్దేశంతో పనికిరాని హామీలిచ్చారు. 100 రోజుల్లో 5 గ్యారంటీల అమలు చేశామని కాంగ్రెస్ చెప్పుకంటూ ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వాస్తవాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నరు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలి. నరేంద్ర మోదీ గారి సునామీలో రేవంత్ రెడ్డి కాళ్ల కింద భూమి కొట్టుకుపోతోంది. తెలంగాణలో మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. అందుకే, ఏదోరకంగా బిజెపిపై దాడి చేసి తన కుర్చీ నిలుపుకోవాలనే కుట్రతో కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకుంటాం. రోజురోజుకు బిజెపి గ్రాఫ్ పెరుగుతోంది. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. గ్రామాల్లో కరెంట్ కోతలు, మంచినీటి ఇబ్బందులు విపరీతంగా పెరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్.. కరువు, మోసం, దగా, కుటుంబ పాలన, ప్రజలను మభ్యపెట్టడం. అది కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్ లో రుజువైంది. ఇప్పుడు తెలంగాణలోనూ రుజువైంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నెత్తిపై గాడిదగుడ్డు పెట్టుకుని తిరుగుతున్నడు. కాంగ్రెస్ పార్టీ చేయిగుర్తు మార్చుకుని గాడిదగుడ్డు గుర్తు పెట్టుకున్నట్లుగా ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు…

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates