మాదిగలకు,బీసీలకు న్యాయం జరిగేవరకు యుద్దం చేస్తా.మంద కృష్ణ మాదిగ

Published on

హన్మంకొండ. ఏఫ్రిల్ 13 మాదిగలకు అన్యాయం చేసేందుకే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటిల రాజకీయం చేశారని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ద్వజమెత్తారు.శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో పాల్గొన్న ఆయన కడియం శ్రీహరి పై మాటల తూటాలను సందించారు. నీచ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం శ్రీహరి అని ఆయన మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికలో రెండు పార్టీలనుంచి టిక్కెట్ తీసుకున్నరాజకీయ నేతగా చరిత్రలో నిలిచిన ఘనత కడయంకు దక్కిందని ఆరోపించారు.కడియం శ్రీహరి పిచ్చి కుక్క కన్నా హీనమైన వ్యక్తని, ఎఫ్పుడు కొంపలు ముంచుతాడో ఎవ్వరికి అర్థం కాడని వ్యక్తని ఎద్దేవ చేశారు.బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, పార్టీ మారిన ఆయన తక్షణమే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఆత్వారతనే రాజకీయ విలువల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కడియంకు లేదన్నారు.
లక్ష్యం కోసం, లక్ష్య సాధాన కోసం ఎమ్మార్పిఎస్ కండువా కప్పుకుని మొక్కవోని ధైర్యం తో పోరాటం చేస్తున్నాని కండియంకు సూచించారు. కానీ రాజకీయ లబ్దీ కోసం టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కండువాలను మార్చలేదని ఎద్దేవ చేశారు.బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేస్తుందని ముందుకు వెల్లుతోంది కాబట్టే మాదిగలుగా మా మద్దతు ప్రకటించామన్నారు.
కష్టాలు వస్తే పార్టీలు, కండువాలను మార్చే తత్వం మాది కాదన్నారు. నమ్మిన వాల్లను నట్టేటముంచి ఆయా పార్టీనుంచి బయటకు వచ్చే వారము కాదన్నాారు. ఆనాడు కష్టాల్లో ఉన్న కేసీఆర్ కు ఫ్రొపేసర్ జైశంకర్ సార్ తో తోడుగా ఉన్నామని గుర్తు చేశారు.కెసిఆర్ హయాంలో దొరల పాలన సాగింది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్డిల పాలన సాగుతోందని ద్వజమెత్తారు. అందుకు సాక్ష్యాలు ఇవే అని వివరించారు. క్యాబినెట్ లో రెడ్డి వర్గానికి చెందిన వారి సంఖ్య అధికమని,కార్పొరేషన్ చైర్మన్ లలో రెడ్డిలకే అధిక ప్రాధాన్యత కల్పించారని,ఇక పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ పార్లమెంటు ఇన్చార్జిలుగా రెడ్డిలనే నియమించడం వెనక ఉన్న ఆంతర్యర్యం ఏంటని ప్రశ్నించారు.
ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో రెడ్డి అధికారులే కీలక పాత్ర నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు.దర్యాపర్తు చేపట్టేందుకు ఎస్సీఎస్టీ,బీసీ,మైనార్టీ అధికారులు లేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రేవంత్ పాలనలో రిజర్వేషన్ కల్పించడంలో మాదిగలకు అన్యాయం చేసి,మాలలన పక్షాణ నిలిచారని ఆరోపించారు.జనరల్ విషయాల్లో బీసీలకు అన్యాయం చేసి రెడ్డి పక్షాన నిలిచారని మండిపడ్డారు.

Search

Latest Updates