డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి..గోవింద్ నరేష్ మాదిగ

Published on

హైదరాబాద్. ఏఫ్రిల్ 14.భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మేధాశక్తిని తెలుసుకున్న ప్రపంచం ఆయన జన్మించిన రోజును ప్రపంచ జ్ఞానదినోత్సవంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ స్పష్టం చేశారు. హైదరాబాద్ పార్శిగుట్టలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలుమాల వేసి నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో మందకృష్ణ మాదిగ తన పోరాటం చేస్తున్నారని వివరించారు. మంద కృష్ణ మాదిక సారథ్యంలో సామాజిక న్యాయ సాధనతో జాతి అభివృద్ధికై మాదిగ,మాదిగ ఉపకులాలు వారు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

ఆనాడు భారత దేశంలో సామాజిక,ఆర్థిక,రాజకీయ సమస్యల పుట్టగా ఉండగా…డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని దారపోసి పీడిత వర్గాలకు పరిష్కారం చూపారని గుర్తుచేశారు.దేశానికి దిశానిర్ధేశం చేసేలా రాజ్యాంగాన్ని రచించిన గొప్పతనం,మేధస్సు ఆయన సొంతమన్నారు. ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్యసమితి అంబేద్కర్ గారి జన్మదినమే ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు.సామాజిక న్యాయంతో కూడిన భారతదేశం కోసం అంబేద్కర్ కలలుగన్నారని వివరించారు.భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం కూడా అదే ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు.అంబేద్కర్ వారసత్వాన్ని.ఆయన అడుగుజాడల్లో నస్తున్నది దండోరా ఉద్యమమం అని పేర్కొన్నారు.

నాడు బీఆర్ అంబేద్కర్ కు అనేక అడ్డంకులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని,ఆ కారణంగా నేటికీ దేశంలో సామాజిక న్యాయం అందకుండా,దళితులు,వెనుకబడ్డ వర్గాలకు అన్యాయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలో ఉండి మాదిగ జాతికి అవకాశాలు కల్పించడంలో,అభివృద్ధిలో కాంగ్రెస్ ద్రోహం చేస్తుందని ప్రజలు చూస్తున్నారని తెలియజేశారు.అంబేద్కర్ గారి స్ఫూర్తితో SC రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకుంటాం! – సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారాన్ని అందుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహారావు మాదిగ, ఎమ్మెఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ,ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు నలిమేల విజయరావు మాదిగ, ఎమ్మెస్పీ హైదరాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి చెండేటి వేణుగోపాల్ మాదిగ, గజ్జల రాజశేఖర్ మాదిగ, బడుగుల బాలకృష్ణ మాదిగ,ఎంఎంఎస్ నాయకురాలు సూరారం సుజాత మాదిగ, యాదయ్య మాదిగ, కొప్పుల సాయికుమార్ మాదిగ, క్రాంతి మాదిగ, కొయ్యడ రమేష్ మాదిగ, బలుగుల మహేష్ మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు

Search

Latest Updates