IED పేలి సైనికుడికి గాయలు

Published on

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెషర్ IED తగిలి DRG సైనికుడు గాయపడ్డాడు. ఐఈడీ పేలుడులో గాయపడిన సైనికుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సైనికుడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులు శుక్రవారం సమాచారం అందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలో నక్సల్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా జూన్ 10న డిఆర్‌జి, బస్తర్ ఫైటర్స్, ఎస్‌టిఎఫ్, కోబ్రా దళాలు ఫర్సెగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Search

Latest Updates