కాంగ్రెస్ కు మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు..

Published on

జగిత్యాల్ ఏప్రిల్ 11 ; జగిత్యాల పట్టణ కేంద్రంలోనీ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎమ్మార్పీస్ మరియు అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే మాలల పెత్తనం, రెడ్డిల రాజ్యం అని అర్థం అన్నారు. అందుకే తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క టికెట్ కుడా కేటాయించకుండా మాలలకు కాంగ్రెస్ కొమ్ము కాసిందని అన్నారు. మాదిగలను ఓట్లు వేసే యంత్రాలుగానే కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు. మాలలకు నెత్తి మీదకు ఎక్కించుకోవడం, మాదిగలను పాదాల కింద అణచి పెట్టడం అనాదిగా కాంగ్రెస్ అధికారికంగా అమలు చేస్తున్న ఆచారం అని అన్నారు. ఇంతటి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీ పట్ల మాదిగ జాతి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు. తన కుటుంబం సంక్షేమం కోసం ఎంత నిబద్దతతో పని చేస్తానో మాదిగల కోసం కుడా అంతే నిబద్దతతో పని చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాదిగల వ్యతిరేకంగా వ్యహరిస్తు ఘోరమైన ద్రోహం చేశాడని అన్నారు. రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకుని విధానాలలో మార్పు తెచ్చుకోవాలని అన్నారు. ఎంపీ స్థానాలలో కనీసం ప్రాతినిధ్యం ఇవ్వలేదని మాదిగలంతా ఆవేదన చెందుతుంటే మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ కూడా మాలలకు ( శ్రీ గణేష్) కేటాయించడం సిగ్గు చేటు అని అన్నారు. ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది మాదిగల ఆత్మగౌరవ సమస్య అని, మాదిగల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులూ మాదిగల ఓట్లు అడగడానికి రావద్దని అన్నారు. ఆత్మగౌరవంతో బతికే ఏ మాదిగ బిడ్డ కాంగ్రెస్ కు ఓటు వేయద్దని అన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మంద కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఇంకా వారం రోజుల పాటు పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు దూమల గంగారం జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లి అనిల్ ముప్ఫరపు రామ స్వామి అఖిలపక్షం నాయకులు సంగెం ముత్యం ,ఏనుగంధుల్ మోహన్,బపురపుగంగారాం,బంగారు దీపక్, బోణగిరి, లక్ష్మణ్,కొల్లూరి సురేందర్, నక్క జీవన్,నక్క గంగాధర్,కొత్తురి నర్సయ్య,చెందోళి హరి కిరణ్,బపురపు శేఖర్,మాట్ల భుచ్చన్న ,దయ్యల హనుమంత్, తదితరులు పాల్గొన్నారు.

Search

Latest Updates